మార్టూరు జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు వైపు వెళ్లే కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని హైవే అంబులెన్స్ సిబ్బంది చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా కారుని క్రేన్ సాయంతో పక్కకు తీశారు. వారి సమాచారం మేరకు మార్టూరు పోలీసులు విచారణ చేపట్టారు.