బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించి, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని అర్జీలను స్వీకరించారు. మొత్తం 135 అర్జీలు అందాయని, వీటిలో పెన్షన్ల మంజూరుకు 20, ఇళ్ల స్థలాల కోసం 110, ఇతర సమస్యలపై 5 అర్జీలు ఉన్నాయని తెలిపారు. సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.