బాపట్ల జిల్లా చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ సుబ్బారావు నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. ఈరోజు రాత్రి పోలీసులు సూచించిన సమయం ముగిసిన తరువాత ఎవరూ రోడ్లపైకి రావద్దని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు. అలాగే బైక్ సైలెన్సర్లతో అనవసర శబ్ధాలు చేయవద్దని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.