చీరాల పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. పట్టణంలోని మాణిక్యమ్మ (అపోలో) హాస్పిటల్ నుండి మసీద్ సెంటర్ వరకు నిర్మించనున్న కీలకమైన సీసీ రోడ్డు పనులకు మంగళవారం ఆయన శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు. ఈ రహదారి పనుల కోసం డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుండి రూ. 55 లక్షల నిధులను మంజూరు చేసేమని ఆయన వెల్లడించారు. త్వరలో రూ. 50 లక్షలు మంజూరు చేసి సమగ్ర అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు, కూటమినేతలు పాల్గొన్నారు.