ఏబీఎన్ విలేకరి హత్యకు నిరసనగా చీరాలలో ర్యాలీ

24చూసినవారు
ఏబీఎన్ విలేకరి హత్యకు నిరసనగా చీరాలలో ర్యాలీ
చిత్తూరు జిల్లా వి. కోటలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ బుధవారం బాపట్ల జిల్లా చీరాలలో జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక గడియారస్తంభం సెంటర్ నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని హంతకులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. అనంతరం తహసిల్దార్ కు వినతి పత్రం అందించారు. విలేకరి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ట్యాగ్స్ :