వేటపాలెం మండలంలోని జాతీయ రహదారి-216పై పందిళ్లపల్లి సమీపంలో గురువారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు జరిగిన ఈ ప్రమాదంలో గాయపడిన యువకుడిని వెంటనే అంబులెన్స్‌లో సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.