వర్షాలతో జలమయం పాఠశాల, విద్యార్థుల కష్టాలు

3చూసినవారు
చీరాల సమీపంలోని వేటపాలెం మండలం, చల్లారెడ్డి పాలెం పంచాయతీ పరిధిలోని జెడీపీహెచ్ఎస్ కటారివారిపాలెం పాఠశాల విద్యార్థులు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరగతి గదులు జలమయం కావడంతో బోధన, క్రీడా కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. పాఠశాల పరిసరాల్లో నీరు నిల్వ ఉండటంతో దోమలు, దుర్వాసన సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచి, తరగతి గదుల మరమ్మత్తులు చేయాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్యేను కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్