దాదాపు 25 కేసులలో నిందితురాలిగా ఉన్న అంతర్రాష్ట్ర నేరస్థురాలు కావాటి లలితను ఇంకొల్లు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఇంకొల్లు పోలీసులను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. కళ్ళు మూసి తెరిచేలోగా చోరీకి పాల్పడే నేర్పుగల లలితను పట్టుకోవడంలో సి.ఐ రమణయ్య, ఎస్సై సురేష్ బాబు చేసిన కృషిని ఎస్పీ ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి నేరాలను అరికట్టాలని ఆయన పోలీసులకు సూచించారు.