తుఫాన్ ఫైటర్ అవార్డు: ఎమ్మెల్యే కొండయ్య ఆనందం

4చూసినవారు
చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య రాష్ట్ర ప్రభుత్వం "మొంతా తుఫాన్ ఫైటర్" అవార్డుతో పాటు ప్రశంసాపత్రాన్ని సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని, అధికార యంత్రాంగం, ప్రజల సహకారంతోనే తుఫానును సమర్థవంతంగా ఎదుర్కోగలిగామని ఆయన అన్నారు. బాపట్ల జిల్లాలో "మొంతా తుఫాన్ ఫైటర్"గా ప్రజాప్రతినిధిగా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని, క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు, ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైందని, భవిష్యత్తులోనూ ప్రజా ప్రయోజనాల కోసం కృషి చేస్తానని కొండయ్య తెలిపారు.