తుఫాను బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది

20చూసినవారు
తుఫాను బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం గ్రామంలో ముంథ తుఫాను బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఇంటికి 50 కేజీల బియ్యం, వంటనూనె, ఉల్లిపాయలు, చింతపండు, కూరగాయలు పంపిణీ చేసింది. టిడిపి ప్రభుత్వం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, వారి కోసమే పనిచేస్తుందని టిడిపి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాపురం సొసైటీ ప్రెసిడెంట్ కోడూరి వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్