బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలంలో రామన్నపేట పంచాయతీ పరిధిలో చేనేత చేతి వృత్తిదారులకు అండగా ఉంటానని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. సోమవారం వేటపాలెం మండలం రామన్నపేట లో చేనేత చేతివృత్తుదారులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తుందని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.