Apr 14, 2026, 18:04 IST/
IPL-2026: KKRపై చెన్నై ఘన విజయం
Apr 14, 2026, 18:04 IST
IPL-2026లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో KKRపై చెన్నై సూపర్ కింగ్స్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన CSK నిర్ణీత 20 ఓవర్లలో 192/5 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన KKR నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేసింది. కోల్కతా బ్యాటర్లలో పోవెల్ 31, రామన్దీప్ సింగ్ 35, సునీల్ నరైన్ 24, అజింక్యా రహానే 28, అంగ్ క్రిష్ 27 పరుగులతో నిరాశ పరిచారు. నూర్ అహ్మద్ 3, కాంబోజ్ 2, ఖలీల్ అహ్మద్, హోసేన్ తలో వికెట్ తీశారు.