
GNT: ఫుడ్ పాయిజన్‌తో 50 మందికి అస్వస్థత.. వైద్యాధికారుల విచారణ!
చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో ఫుడ్ పాయిజన్ కారణంగా సుమారు 50 మంది అస్వస్థతకు గురయ్యారు. జిల్లా వైద్యాధికారులు గ్రామంలో విచారణ చేపట్టారు. వైద్య సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి బాధితుల ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. తీవ్ర వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న ఆరుమళ్ల వజ్రమ్మ, యమున, పెద్దిపాక రాజేశ్‌లను మెరుగైన చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు.






































