జీవో 45 ప్రకారం, ఉమ్మడి జిల్లాల వారీగా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ జూన్ నెలాఖరులోగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సర్దుబాటులో భాగంగా గుంటూరు జిల్లాకు సుమారు 1,200 టీచర్ పోస్టులు లభించే అవకాశం ఉంది. పల్నాడు జిల్లాకు 4 వేల, బాపట్ల జిల్లాకు 800 పోస్టులు కేటాయించే అవకాశముంది. గుంటూరులో సీనియారిటీ పూర్తైన సుమారు 1,800 మంది ఉపాధ్యాయులు పల్నాడుకు బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా జిల్లాల కేటాయింపు చేసి, అనంతరం ఆన్‌లైన్ ద్వారా పాఠశాలలను ఎంపిక చేసుకునే విధానం అమలు చేయనున్నట్లు సమాచారం.