ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సులు.. గుంటూరుకు 100

7చూసినవారు
ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సులు.. గుంటూరుకు 100
ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ బస్సు సేవ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు 750 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరుకు 100, విజయవాడకు 100, అమరావతికి 50 బస్సులు కేటాయించినట్లు వెల్లడించారు. ఛార్జింగ్ స్టేషన్లు, మౌలిక సదుపాయాల ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, 2026 చివరి నాటికి బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్