ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్ పీసెట్-2026 దేహదారుఢ్య
పరీక్షలు బుధవారం, 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కన్వీనర్ పాల్ కుమార్ తెలిపారు. బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల ప్రవేశాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 6వ తేదీ వరకు పురుష అభ్యర్థులకు, 7, 8 తేదీల్లో మహిళా అభ్యర్థులకు
పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు 100, 800 మీటర్ల పరుగు, షాట్‌పుట్, జంపింగ్ ఈవెంట్లతో పాటు ఎంపిక చేసుకున్న క్రీడలో ప్రతిభ చూపాలి.