పెదకాకానిలో ఆటో ప్రమాదం.. నలుగురికి గాయాలు

8చూసినవారు
గురువారం పెదకాకాని జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు గాయపడ్డారు. ఎన్నారై ఆసుపత్రి నుంచి వెనిగండ్ల వైపు వెళ్తున్న ఆటో, స్మశానం సమీపంలో అదుపుతప్పి సుమారు పది అడుగుల లోతైన కాలువలో పడిపోయింది. ప్రమాద సమయంలో ఆటో డ్రైవర్ స్పృహ కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్