గుంటూరు రైల్వేస్టేషన్ వద్ద యువకుడి మృతదేహం

5చూసినవారు
గుంటూరు రైల్వేస్టేషన్ వద్ద యువకుడి మృతదేహం
గుంటూరు రైల్వేస్టేషన్ ఎదురుగా గుర్తుతెలియని యువకుడి మృతదేహం పడి ఉన్నట్లు కొత్తపేట పోలీసులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తమకు సమాచారం అందిందని, స్థానికంగా విచారించినా మృతుని వివరాలు తెలియకపోవడంతో మృతదేహాన్ని జీజీహెచ్ మార్చరీలో భద్రపరిచినట్లు పేర్కొన్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్