మహిళని చంపుతామని బెదిరించిన వ్యక్తులపై కేసు: CI

8చూసినవారు
మహిళని చంపుతామని బెదిరించిన వ్యక్తులపై కేసు: CI
గుంటూరు చైతన్యపురి కాలనీకి చెందిన నిఖిత అనే మహిళకు ఇంటి నిర్మాణం పేరుతో చైతన్య, రామకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు రూ.52 లక్షలు తీసుకున్నారు. సత్తెనపల్లి వెంచర్‌లో ఇళ్లు నిర్మిస్తామని చెప్పి, పనులు మధ్యలో వదిలేశారు. నిఖిత ప్రశ్నించగా, ఆమెను చంపుతామని బెదిరించారు. దీంతో బాధితురాలు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఇద్దరిపై కేసు నమోదైంది. CI వెంకటేశ్వర్లు ఈ వివరాలను వెల్లడించారు.

సంబంధిత పోస్ట్