రేపు విడుదల కానున్న పదో తరగతి ఫలితాలు: విద్యాశాఖ ప్రకటన

3088చూసినవారు
రేపు విడుదల కానున్న పదో తరగతి ఫలితాలు: విద్యాశాఖ ప్రకటన
రాష్ట్ర పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ గురువారం, ఏప్రిల్ 30న ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌ వేదికగా ఫలితాలను ప్రకటించనున్నారు. ప్రభుత్వ పరీక్షల విభాగం ఫలితాల విడుదలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసింది. విద్యార్థులు విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్, మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009, మరియు ‘LEAP’ మొబైల్ యాప్ ద్వారా తమ మార్కుల మెమోను పొందవచ్చు.

సంబంధిత పోస్ట్