గుంటూరులో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

13చూసినవారు
గుంటూరులో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ 3న గుంటూరులో పీవీఎస్ లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హాజరుకానున్న నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ మంగళవారం కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రత, వేదిక నిర్వహణ, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, అతిథుల రాకపోకలపై కలెక్టర్ సమీక్షించారు. కార్యక్రమ విజయవంతానికి అధికారుల సమన్వయం అవసరమని సూచించారు. ఈ పరిశీలనలో ఆర్డీఓ కె. శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్