
ఫిబ్రవరిలో పీఎం కిసాన్ 22వ విడత నిధులు విడుదల!
TG: దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త అందించనుంది. ఫిబ్రవరిలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 22వ విడత నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఏడాదికి రూ.6 వేల సహాయం అందిస్తోంది, దీనిని రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా అందిస్తారు. దాదాపు 9 కోట్ల మంది రైతులు లబ్ధిదారులుగా ఉన్నారు.




