
గుడ్ న్యూస్.. రేపటి నుంచి జిల్లాల వారీగా పాసు పుస్తకాల పంపిణీ
AP: రైతులకు కూటమి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేపటి(శుక్రవారం) నుంచి ఆయా జిల్లాల వారీగా పట్టాదారు పాసు పుస్తకాలను అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మండలాల వారీగా ఓ షెడ్యూల్ ఇస్తామని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి అనగాని సత్య ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. ఆ పాసు పుస్తకాల్లో తప్పులు ఉంటే ఇంటికి వచ్చి అధికారులు సరి చేస్తారని అన్నారు. రెవెన్యూ క్లినిక్లను అన్ని జిల్లాల్లో విస్తరించి భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపుతామని వివరించారు.




