తుళ్లూరు మండలం నెక్కల్లు పరిధిలో నిర్మాణ కంపెనీకి చెందిన టిప్పర్ ఢీకొనడంతో టీ వ్యాపారి ఒకరు గాయపడ్డారు. ఈ ఘటనలో వ్యక్తి కాలు విరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. క్షతగాత్రుడిని 108 అంబులెన్స్ ద్వారా గుంటూరు ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.