పెదనందిపాడు మండలం వరగానిలో తీవ్ర ఎండల కారణంగా 85 ఏళ్ల వ్యవసాయ కూలీ వీరయ్య వడదెబ్బతో మృతి చెందారు. గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఆయన స్పృహతప్పి పడిపోయారు. ఆర్ఎంపీ వైద్యుడి చికిత్స అందించినా, పరిస్థితి విషమించి ఆస్పత్రికి తరలించేలోపే మరణించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.