గుంటూరులో డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో
వీసా రెన్యూవల్ చేస్తామని చెప్పి రూ. 14 లక్షలకు పైగా మోసం చేశారన్న ఫిర్యాదుతో ఇన్‌ఫ్లుయెన్సర్ రమానందన కుటుంబంపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితుడు శివక్రాంతి కుమార్ ఫిర్యాదు మేరకు గత ఏడాది నవంబర్‌లో రమానందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్, ఆమె తండ్రి మధుకర్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.