పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని కమిషనర్ శ్రీనివాసులు శనివారం హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన 56, 27 వార్డు సచివాలయ సంక్షేమ కార్యదర్శులు టి. రాజాబాబు, సీహెచ్ విజయలక్ష్మికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. శనివారం కావేరినగర్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.