బారాయిమాంపంజా సెంటర్కు చెందిన షేక్ అస్లాం (48) కనిపించటంలేదని లాలాపేట పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అతను ఆటోనడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబ అవసరాల కోసం తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. వాటిని తీర్చలేకపోతున్నానని తరచూ బాధపడుతుండేవాడని, ఇంటి నుంచి వెళ్లిపోయిన అతను తిరిగి రాలేదని కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లాలాపేట పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.