గుంటూరు: రైల్వే స్టేషన్ సమీపంలో మృతదేహం లభ్యం

12చూసినవారు
గుంటూరు: రైల్వే స్టేషన్ సమీపంలో మృతదేహం లభ్యం
గుంటూరు రైల్వే స్టేషన్ కార్ పార్కింగ్ స్టాండ్ ఫుట్ పాత్పై 45 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని కొత్తపేట పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు విచారణ చేపట్టినప్పటికీ మృతుడి వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. దీంతో మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చూరీలో భద్రపరిచారు. మృతుడి వివరాలు తెలిసిన వారు కొత్తపేట స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.