గుంటూరు రైల్వే పోలీస్ పరిధిలోని కృష్ణానది వంతెన - కృష్ణ కెనాల్ స్టేషన్ల మధ్య శనివారం ఓ గుర్తుతెలియని 75 ఏళ్ల వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు తెల్ల చొక్కా, బులుగు రంగు అంచు గల తెల్ల లుంగీ ధరించి ఉన్నాడు. జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.