గుంటూరు ఆటో నగర్ లోని ఒక బేకరీలో కుళ్ళిపోయిన పురుగులతో కూడిన కేకులు ఉన్నాయని స్థానికులు ఆరోపించారు. వీటిని గుర్తించి బేకరీ యజమానులను ప్రశ్నించగా, వారు బెదిరింపులకు పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఇలాంటి బేకరీలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరారు.