గుంటూరు: సామాజిక బాధ్యతతో ముందుకు రావడం ప్రశంసనీయం

5చూసినవారు
గుంటూరు: సామాజిక బాధ్యతతో ముందుకు రావడం ప్రశంసనీయం
ప్రజలకు ఆరోగ్యవంతమైన జీవనశైలిని ప్రోత్సహించే వ్యక్తులు ముందుకు రావడం అభినందనీయమని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర పేర్కొన్నారు. కొరిటెపాడు వాకింగ్ ట్రాక్ అభివృద్ధికి వెంకటేష్ కన్స్ట్రక్షన్స్ అధినేత పులివర్తి శేషగిరిరావు, ప్రధాన్ హాస్పిటల్స్ సంయుక్తంగా రూ.6 లక్షలు విరాళం అందించారు. మంగళవారం మేయర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీనివాసులు చెక్ అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వాకింగ్ ట్రాక్ అభివృద్ధికి సామాజిక బాధ్యతతో ముందుకు రావడం ప్రశంసనీయమని అన్నారు.

సంబంధిత పోస్ట్