గుంటూరులోని విజయలక్ష్మి బార్‌లో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను నగరంపాలెం పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ అందించిన సమాచారం ఆధారంగా పోలీసులు దాడి చేసి, నిందితుల వద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.