గుంటూరు-1 డిపో మేనేజర్ ఎంవీఎస్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ఆర్టీసీ బస్టాండులో డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం జరుగుతుంది. క్రోసూరు, అమరావతి, తుళ్లూరు, పర్చూరు రూట్లలో బస్సుల వేళల్లో మార్పులు, సిబ్బంది ప్రవర్తన, అదనపు సర్వీసుల ఏర్పాటు వంటి అంశాలపై ప్రయాణికులు 99592 25420 నంబరుకు ఫోన్ చేసి తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు.