గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్, స్థానిక కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 40 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గత 18 నెలల్లో నియోజకవర్గంలో సీఎం సహాయనిధి ద్వారా రూ. 9.67 కోట్ల విలువైన చెక్కులు అందించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.