గుంటూరు: నగరపాలక సంస్థలో అంతర్గత బదిలీలు

7చూసినవారు
గుంటూరు: నగరపాలక సంస్థలో అంతర్గత బదిలీలు
పరిపాలన కారణాల నేపథ్యంలో, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు పలువురు ఉద్యోగులను అంతర్గతంగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జీఎంసీ మేనేజరుగా ఉన్న షేక్ బాలాజీబాషాకు సీ సెక్షన్, లీగల్ సెల్, ఎన్నికల విభాగం ఇన్ఛార్జిగా, పట్టణ ప్రణాళిక విభాగం సూపరింటెండెంట్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్వోగా, కమిషనర్ పేషీలో విధులు నిర్వహిస్తున్న ఎస్.ఎన్. ప్రసాద్కు అకౌంటెంట్-1గా అదనపు బాధ్యతలు కేటాయించారు. అకౌంటెంట్గా పనిచేస్తున్న పి. నమ్రతుమార్ను మేనేజరుగా నియమించారు. ఈ బదిలీలు పని సర్దుబాటులో భాగంగా జరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్