ఆస్తి వివాదం కారణంగా మనస్తాపానికి గురై ఆళా గోపి (35) అనే యువకుడు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులకు సంబంధించిన ఐదు ఎకరాల పొలం పత్రాలు సోదరి శ్రీలక్ష్మీ తిరుపతమ్మ వద్ద ఉండటంతో, వ్యవసాయంలో నష్టపోయి అప్పులు తీర్చాలనుకున్న గోపి పత్రాలు అడిగితే ఆమె నిరాకరించింది. దీంతో గోపి ఒక ఎకరం పొలం అమ్మాడు. అయితే, ఆ పొలంలో తమకు వాటా ఉందని శ్రీలక్ష్మీ తిరుపతమ్మ, ఆమె భర్త పోలి రాజు, మామ రామయ్యలు అడ్డుపడి కోర్టు ద్వారా నోటీసులు పంపారు. ఈ పరిణామాలతో మనస్థాపానికి గురైన గోపి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య సరస్వతి ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.