ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందించాలని గుంటూరు కలెక్టర్ భార్గవ్ తేజ తెలిపారు. బలవర్థక ఆహారం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. అక్రమాలు జరగకుండా 25 కిలోల బియ్యపు బస్తాలపై క్యూఆర్ కోడ్ ద్వారా నమోదు చేసి నేరుగా 1,072 పాఠశాలలు, 68 వసతి గృహాలకు పంపిణీ చేస్తున్నామన్నారు.