గుంటూరులో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేస్తోందని తెలిపారు. ఓపీఎస్ ద్వారా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వేలాది మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారని చెప్పారు. అమరావతి రైతుల పేరుతో జగన్‌ను కలిసిన వారు నిజమైన రైతులు కాదని,
వైసీపీ కార్యకర్తలేనని ఆయన ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా అమరావతి ప్రపంచం మెచ్చే రాజధానిగా అభివృద్ధి చెందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.