గుంటూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

1899చూసినవారు
గుంటూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
శనివారం రాత్రి గుంటూరు మిర్చియార్డు వద్ద పనిచేసుకుని తిరిగి వెళ్తున్న పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం రామాపురం గ్రామానికి చెందిన జయరావు (43) లాల్పురం సమీపంలో ఎన్హెచ్ 16 సర్వీస్ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందారు. తీవ్ర గాయాలతో జీజీహెచ్కి తరలించగా వైద్యులు మృతిని నిర్ధారించారు. మృతుడి కుమారుడు రాజేష్ ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్