11 కేవీ శివాలయం ఫీడర్ లో మరమ్మతుల కారణంగా బుధవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని డీఈఈ పి. రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. జెండా చెట్టు, శివాలయం, బొడ్రాయి సెంటర్, ఆంధ్రా బ్యాంకు, ఆంజనేయస్వామి గుడి, చెన్నంవారి వీధి, అంబేడ్కర్ బొమ్మ ప్రాంతాల్లో ఈ సమయంలో విద్యుత్ ఉండదని మంగళవారం సాయంత్రం వెల్లడించారు.