రూ.50 పందెం కోసం తొమ్మిదో తరగతిలో పెన్ను మింగిన 16 ఏళ్ల మురళీకృష్ణ అనే విద్యార్థి, మూడేళ్ల తర్వాత తీవ్ర కడుపునొప్పితో బాధపడ్డాడు. గుంటూరు సర్వజనాసుపత్రిలో వైద్యులు శస్త్రచికిత్స లేకుండానే పెద్దపేగులో ఉన్న పెన్నును విజయవంతంగా తొలగించి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటనపై సూపరింటెండెంట్ ఎస్ఎస్వీ రమణ వివరాలు వెల్లడించారు.