ముస్లింలకు జగన్ బక్రీద్ శుభాకాంక్షలు

12చూసినవారు
ముస్లింలకు జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో, బక్రీద్ త్యాగం, సహనం, మానవత్వానికి ప్రతీకగా నిలిచే పండుగ అని పేర్కొంది. దైవ ప్రవక్త ఇబ్రహీం చేసిన మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ పర్వదినాన్ని జరుపుకుంటారని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం మరింత పెరగాలని జగన్ ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్