కొల్లిపర మండలం చింపారెడ్డిపాలెంలోని జగనన్న కాలనీలో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. బొంతు సీతమ్మ అనే మహిళ నివసిస్తున్న రేకుల షెడ్డుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో లోపల ఉన్న సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. సదరు స్థలం నుంచి ఆమెను ఖాళీ చేయించేందుకే ఎవరో ఉద్దేశపూర్వకంగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.