తుళ్లూరులో ఉరివేసుకొని వ్యక్తి మృతి

4చూసినవారు
తుళ్లూరులో ఉరివేసుకొని వ్యక్తి మృతి
మంగళవారం రాత్రి తుళ్లూరులోని టిట్కో గృహాల్లో అద్దెకు ఉంటున్న మనోజ్ (32) అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒడిశా రాష్ట్రానికి చెందిన మనోజ్ అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్