గుంటూరులో మెగా జాబ్ మేళా: 518 మందికి ఉద్యోగాలు

4చూసినవారు
గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ముస్లిం కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు 1287 మంది యువతీయువకులు హాజరయ్యారు. ఈ మేళాలో 33 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించగా, 518 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, యువత తమకు నచ్చిన రంగంలో నైపుణ్యం పెంచుకుని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యే నసీర్ యువతను అభినందించారు.

సంబంధిత పోస్ట్