గుంటూరులో మంగళవారం జరిగిన జడ్పీ సమీక్ష సమావేశంలో 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో జరుగుతున్న ఆలస్యంపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఈవో జ్యోతిబసు, పనులు వేగంగా పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మండల అధికారులను హెచ్చరించారు. జడ్పీ ఛైర్‌పర్సన్ హెనీ క్రిస్టీనా గ్రామీణ అభివృద్ధికి కేటాయించిన నిధులను సకాలంలో వినియోగించాలని సూచించారు.