గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్)లో శనివారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామానికి చెందిన శ్రీనివాస్ (50), కిడ్నీ వ్యాధితో బాధపడుతూ, ఆసుపత్రి భవనం పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఈ నెల 23న చికిత్స నిమిత్తం జీజీహెచ్‌లో చేరినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.