పట్టాభిపురం: ఢిల్లీ పోలీసుల పేరుతో ఘరానా మోసం

4చూసినవారు
పట్టాభిపురం: ఢిల్లీ పోలీసుల పేరుతో ఘరానా మోసం
ఢిల్లీ పోలీసులమని చెప్పుకుంటూ, కెనరా బ్యాంకులో హవాలా స్కామ్ జరిగిందని, మనీలాండరింగ్ కేసు నమోదైందని విశ్రాంత పంచాయతీ కార్యదర్శి కె.రవిశంకర్ ను భయపెట్టి, డిజిటల్ అరెస్టు పేరుతో రూ.12.50 లక్షలు దోచుకున్న గుర్తుతెలియని వ్యక్తులపై గుంటూరు అరండల్పేట ఠాణాలో కేసు నమోదైంది. ఈనెల 4న జరిగిన ఈ సంఘటనలో, బాధితుడు ఫిక్సిడ్ డిపాజిట్లు రద్దు చేసి, బంగారం తాకట్టు పెట్టేందుకు సిద్ధమవుతుండగా, అతని కుమారుడు విషయాన్ని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్