ఫిరంగిపురం: లారీ ఢీకొట్టడంతో బైక్ రైడర్ స్పాట్ డెడ్

3227చూసినవారు
ఫిరంగిపురం మండలంలోని వేములూరిపాడు దర్గా సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. నరసరావుపేట వైపు నుంచి వస్తున్న లారీ, గుంటూరు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్